మొబైల్ యూజర్లకు తీపి కబురు: ఎఫ్ 35 సిరీస్ కు కలర్ ఓఎస్ 17 అప్డేట్
రిపోర్టర్: శివ
స్థలం: New Delhi
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తన ఎఫ్ 35 సిరీస్ ఫోన్ల కోసం సరికొత్త కలర్ ఓఎస్ 17 అప్డేట్ను విడుదల చేస్తున్నట్లు కంపెనీ అధికారులు వెల్లడించారు. ఈ లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా వినియోగదారులకు మెరుగైన సిమ్యులేషన్ యానిమేషన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లు, ల్యామినర్ ఫ్ లో ఇంజిన్ అందుబాటులోకి వస్తాయని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఫోన్ పనితీరును మరింత వేగవంతం చేయడంతో పాటు భద్రతా పరమైన రక్షణను కూడా ఈ అప్డేట్ అందిస్తుందని తెలిపారు.