ది ప్యారడైజ్ ప్రీమియర్ షోపై నాని విజ్ఞప్తికి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ది ప్యారడైజ్ సినిమా సెప్టెంబర్ 24న విడుదల కానున్న నేపథ్యంలో, సెప్టెంబర్ 23న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో జరిగే ప్రీమియర్ షోకు రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని నాని కోరారు. భద్రతా మార్గదర్శకాలను గౌరవిస్తూ ముందుకు వచ్చిన నానిని అభినందించిన సీఎం.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అక్కడి పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లను బట్టి పోలీసులు తగిన నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.