పలాసలో దసరా కానుకగా ప్రారంభమైన కాశీబుగ్గ రైల్వే వంతెన

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాసలో దసరా పండుగను పురస్కరించుకుని కాశీబుగ్గ రైల్వే వంతెనపై రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈ నెల ఎనిమిదో తేదీన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో ఎమ్మెల్యే గౌతు శిరీష ఈ వంతెనను ప్రారంభించారు. సోమవారం సాయంత్రం వంతెనను సందర్శించిన ఎమ్మెల్యే శిరీష, ఇచ్చిన మాట ప్రకారం విజయదశమికి ముందే వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చామని తెలిపారు.