మణిపూర్ లో తీవ్రమవుతున్న జాతి ఘర్షణలు: ప్రమాదకరంగా మారుతున్న సరిహద్దు రాష్ట్ర పరిస్థితులు

రిపోర్టర్: సురేష్ స్థలం: Manipur

మణిపూర్ లో గత మూడేళ్లకు పైగా కొనసాగుతున్న జాతి ఘర్షణలు మరింత ప్రమాదకర రూపం దాల్చుతున్నాయని రక్షణ రంగ నిపుణులు అభిజిత్ అయ్యర్ మిత్రా తెలిపారు. మయన్మార్ మిలిటెంట్ల ప్రమేయం, విదేశీ ఆయుధాల అక్రమ రవాణా సరిహద్దు రాష్ట్రంలో హింసను మరింత పెంచుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల వైఫల్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొంటూ, మైతేయి, కుకీ, నాగా వర్గాల మధ్య భయానక వాతావరణం నెలకొందని స్పష్టం చేశారు.