తిరుమల బ్రహ్మోత్సవాలలో ముప్పై మూడు లక్షల లడ్డూలు విక్రయించినట్లు తితిదే ఛైర్మన్ వెల్లడి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తిరుపతి

శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఈవో ముద్దాడ రవిచంద్రతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎనిమిది రోజుల్లో ఐదు లక్షల డెబ్బై ఆరు వేల మంది స్వామివారిని దర్శించుకున్నారని, ఇరవై ఎనిమిది కోట్ల తొంబై నాలుగు లక్షల రూపాయల హుండీ కానుకలు వచ్చాయని పేర్కొన్నారు. ముప్పై మూడు లక్షల లడ్డూ ప్రసాదాలు విక్రయించినట్లు వెల్లడించారు.