ప్రభుత్వ బడుల అభివృద్ధికి పెద్దపీట: 2029 నాటికి నాలుగు స్టార్ సదుపాయాలు కల్పించాలని మంత్రి లోకేష్ ఆదేశం
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, 2029 నాటికి అన్ని స్కూళ్లను నాలుగు స్టార్ స్థాయికి అప్‌గ్రేడ్ చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏజెన్సీ మరియు వెనుకబడిన ప్రాంతాల పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఈ విద్యా సంవత్సరంలో జీరో-స్టార్ స్కూళ్లను వన్-స్టార్‌గా మార్చాలని స్పష్టం చేశారు.