రాప్తాడు ఘటన: నిందితుడు హేమంత్ పై పోలీసుల కాల్పులు

రిపోర్టర్: రాము స్థలం: అనంతపురం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్ పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పోలీసులపై కత్తితో దాడికి యత్నించడంతో ఈ చర్య చేపట్టామని ఎస్పీ జగదీష్ వెల్లడించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హేమంత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.