మహిళకు ఉద్యోగం నిరాకరించిన ఐఓసీకి సుప్రీంకోర్టు భారీ జరిమానా
రిపోర్టర్: విజయ్
స్థలం: హర్యానా
కేవలం మహిళ అనే కారణంతో ఉద్యోగం నిరాకరించిన ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన సుమిత్రకు రూ. 12 లక్షల నష్టపరిహారం చెల్లించాలని జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలీల ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 38 ఏళ్ల పాటు న్యాయపోరాటం చేసిన బాధితురాలికి ఎట్టకేలకు సుప్రీంకోర్టు ద్వారా న్యాయం దక్కింది.