ధాన్యం సేకరణకు పటిష్ఠమైన కార్యాచరణ చేపట్టాలన్న జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్
రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్
స్థలం: కాకినాడ అర్బన్
ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం పటిష్ఠమైన కార్యాచరణతో సిద్ధం కావాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వ మద్దతు ధరకు సేకరించేందుకు కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో పటిష్ఠం చేయాలని స్పష్టం చేశారు.