అక్టోబర్ 1 నుండి కవ్వాల్లో జంగిల్ సఫారీ ప్రారంభం
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్లో అక్టోబర్ 1 నుండి జంగిల్ సఫారీ వాహనాలు పునఃప్రారంభం కానున్నాయి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నిబంధనల మేరకు మూడు నెలలు సఫారీని నిలిపివేశారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఐదు, ఎకో టూరిజం హరిత రిసార్ట్ ఆధ్వర్యంలో రెండు వాహనాలు అందుబాటులో ఉంటాయని జన్నారం అటవీ డివిజనల్ అధికారి ఎం. రామ్మోహన్ తెలిపారు. పర్యాటకులు నిబంధనలు పాటించాలని కోరారు.