పొదలకూరు పోలేరమ్మ జాతరలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ప్రత్యేక పూజలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా పొదలకూరు పోలేరమ్మ జాతర మూడో రోజు ఘనంగా జరిగింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, నియోజకవర్గ సమన్వయ కర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో అందాలని ఆయన ప్రార్థించారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.