సైబర్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేసిన అన్నమయ్య జిల్లా పోలీసులు
రిపోర్టర్: అశోక్
స్థలం: అన్నమయ్య
అన్నమయ్య జిల్లాలో సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈమెయిల్ మరియు సోషల్ మీడియా ద్వారా వచ్చే ఫిషింగ్ లింక్‌లను క్లిక్ చేయవద్దని అన్నమయ్య పోలీసులు హెచ్చరించారు. అనుమానిత లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆర్థిక మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు లేదా cybercrime.gov.in వేదికగా ఫిర్యాదు చేయాలని సూచించారు.