ప్రధాని మోదీని అనుకరిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఇండోర్
ఇండోర్ వేదికగా జరిగిన ఛత్రోన్ కీ గూంజ్ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతుండగా, రాజకీయ విశ్లేషకుడు ఆనంద్ రంగనాథన్ దీనిపై స్పందిస్తూ ఇటువంటి చర్యలు రాజకీయంగా బీజేపీకే మేలు చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న ఆగ్రహం తాత్కాలికమేనని, అయితే ప్రజల సమస్యలను గాలికి వదిలేసే నాయకులు మాత్రం ఎక్కువ కాలం పదవులలో కొనసాగలేరని ఆయన హెచ్చరించారు.