తిరుపతి-విజయవాడ మధ్య నూతన విమాన సర్వీసులు ప్రారంభం

రిపోర్టర్: కిరణ్ స్థలం: తిరుపతి

ఆంధ్రప్రదేశ్‌లోని రెండు కీలక నగరాలైన తిరుపతి మరియు విజయవాడ మధ్య ప్రయాణికుల సౌలభ్యం కోసం ఫ్లై-91 సంస్థ నూతన ప్రత్యక్ష విమాన సర్వీసులను ప్రారంభించింది. ఈ సేవల ద్వారా విజయవాడ నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు వ్యాపార ప్రయాణికులకు ప్రయాణ సమయం ఎంతో ఆదా కానుంది.