కడెం మండలంలో మాజీ ఎమ్మెల్యే అజ్మీర రేఖా శ్యాంనాయక్ పర్యటన.. పలువురి పరామర్శ!

రిపోర్టర్: Radha. A స్థలం: కడెం

నిర్మల్ జిల్లా కడెం మండలంలో మాజీ ఎమ్మెల్యే అజ్మీర రేఖా శ్యాంనాయక్ పర్యటించారు. సారంగాపూర్ గ్రామంలో ఇటీవల స్వర్గస్తులైన మార్కపు లక్ష్మిరాజం కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం ఎలగడప ఎల్లమ్మ ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి విరాళం అందజేశారు. అలాగే దిల్దార్ నగర్ గ్రామంలో గుండె శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న జగ్గారావును, కాలు తొలగించిన బాధితుడు కలీమ్ను నేరుగా కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు.