తిరుమలలో ప్రైవేటు వాహనాల ఆంక్షలపై టీటీడీ క్లారిటీ

రిపోర్టర్: గోపి స్థలం: తిరుపతి

తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని టీటీడీ స్పష్టం చేసింది. వాహనాలపై ఎలాంటి పరిమితులు లేవని, భక్తులు తప్పుడు పుకార్లను నమ్మవద్దని హెచ్చరించింది. భక్తులను అయోమయానికి గురిచేసేలా తప్పుడు వార్తలు సృష్టించి ప్రచారం చేసే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ స్పష్టం చేసింది.