స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు: ఎమ్మెల్సీ తాతా మధుపై పోలీసులకు ఫిర్యాదు

రిపోర్టర్: గోపి స్థలం: ఖమ్మం

తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఖమ్మం జిల్లా చింతకానిలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న దళిత నేతను అవమానించిన తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.