కేటీఆర్ కంటే ఘాటుగా మాట్లాడడం మాకూ తెలుసు: బల్మూరి వెంకట్
రిపోర్టర్: సునీల్
స్థలం: ఢిల్లీ
ప్రతిపక్షంలో ఉన్నామనే ఫ్రస్ట్రేషన్‌తో బీఆర్‌ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా డ్రామాలు ఆడుతున్నారని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. కేటీఆర్ కంటే ఘాటుగా మాట్లాడడం తమకూ తెలుసని, కానీ సంస్కారం అడ్డు వస్తోందన్నారు. సైఫాబాద్ పీఎస్‌లో ఎలాంటి భౌతిక దాడి జరగలేదని, కేటీఆర్ సిబ్బంది కావాలనే రాద్ధాంతం చేశారని ఆరోపించారు. తెలంగాణ సమాజానికి కేటీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.