బాలికల భద్రతకు పోక్సో చట్టమే రక్షణ కవచమన్న జడ్జి అరుణ్ కుమార్

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

బాలలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు పోక్సో చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని సివిల్ జడ్జి నారం అరుణ్ కుమార్ అన్నారు. ఆమనగల్లు బాలికల జెడ్పీ పాఠశాలలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని విద్యార్థినులకు చట్టంలోని ముఖ్యాంశాలను వివరించారు. ఎవరికైనా సమస్యలు ఎదురైతే భయపడకుండా అధికారులకు సమాచారం అందించాలని, ప్రతి ఒక్కరూ తమ హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు.