నేషనల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్కు మనిక బాత్రా పునరాగమనం

రిపోర్టర్: అశోక్ స్థలం: Panchkula

దేశీయ టోర్నీలకు సుదీర్ఘ విరామం ప్రకటించిన ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనిక బాత్రా తిరిగి జాతీయ సర్క్యూట్లోకి అడుగుపెడుతున్నట్లు టెన్నిస్ వర్గాలు వెల్లడించాయి. హర్యానాలోని పంచకులలో అక్టోబర్ 6 నుండి 13 వరకు జరగనున్న నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో పాల్గొనేందుకు ఆమె అధికారికంగా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం వెలువడింది. గతంలో దేశీయ టోర్నీలకు దూరంగా ఉండటం వల్ల ఆసియా క్రీడల ప్రధాన జట్టులో చోటు కోల్పోయిన మనిక, రాబోయే ఒలింపిక్స్ క్రీడా లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.