'వైసీపీ కార్యకర్తలపై దెబ్బ పడితే నాలుగు దెబ్బలు పడతాయి': ఎంపీ అవినాష్ రెడ్డి వార్నింగ్

రిపోర్టర్: శివ స్థలం: కడప

కడప జిల్లా పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులను, దండుపాళ్యం బ్యాచ్‌లను నమ్ముకుని టీడీపీ ప్రభుత్వం ఎన్నికలు చేయాలని చూస్తోందని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలపై ఒక్క దెబ్బ పడినా తిరిగి నాలుగు దెబ్బలు పడతాయని హెచ్చరించారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, కాలం ఎప్పుడూ ఒకరికే అనుకూలంగా ఉండదని పేర్కొంటూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.