మధ్యప్రదేశ్ పన్నాలో అంతరించిపోతున్న రాబందుల సంఖ్య భారీగా పెరుగుదల.
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్‌లోని పన్నా పులుల సంరక్షణ కేంద్రంలో అంతరించిపోతున్న రాబందుల సంతతి అనూహ్యంగా పునరుజ్జీవనం పొందుతోంది. కాలుష్య నియంత్రణ చర్యలు, అనుకూల వాతావరణం, తగిన ఆహార లభ్యత కారణంగా దేశంలోనే అత్యధికంగా ఏడు రకాల రాబందు జాతులు ఇక్కడ గూళ్లు కట్టుకుంటున్నాయి. పర్యావరణ వేత్తలు ఈ పరిణామాన్ని వన్యప్రాణుల సంరక్షణలో చారిత్రక మైలురాయిగా అభివర్ణిస్తున్నారు.