శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో కొలరాడోలో ఘనంగా మ్యూజిక్ డాన్స్ ఫర్ విజన్

రిపోర్టర్: శివ స్థలం: కొలరాడో

శంకర నేత్రాలయ యూఎస్ఏ కొలరాడో చాప్టర్ ఆధ్వర్యంలో తొలిసారి మ్యూజిక్ డాన్స్ ఫర్ విజన్ 2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు అధ్యక్షుడు బాల ఇందుర్తి తెలిపారు. అంధత్వ నిర్మూలన లక్ష్యంతో అరోరాలో చేపట్టిన ఈ వేడుకకు నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని పేర్కొన్నారు. డాక్టర్ ఎం.ఎస్. రెడ్డి, శ్యామరెడ్డి దంపతులు రెండు గ్రామాల దత్తతకు ఇరవై ఐదు వేల డాలర్లు విరాళంగా ప్రకటించారని, ఈ నిధులతో నెల్లూరులో కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వెల్లడించారు.