తడలో ఘనంగా బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ సమావేశం

రిపోర్టర్: Darla Venkateswarlu స్థలం: తడ

తిరుపతి జిల్లా తడ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం సూళ్లూరుపేట నియోజకవర్గ నూతన కార్యవర్గ సమావేశం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కందం లోకయ్య, నియోజకవర్గ అధ్యక్షులు ఈగ యువరాజు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నియోజకవర్గంలోని ప్రతి మండలానికి నూతన ప్రతినిధులను ఎన్నుకున్నారు. బీసీల సంక్షేమం, అభివృద్ధి మరియు సమస్యల పరిష్కారానికి సంఘం నిరంతరం శ్రమిస్తుందని నాయకులు స్పష్టం చేశారు.