గీతా కార్మికులకు నూతన ఐడీ కార్డుల పంపిణీ
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం పరిధిలోని ఎక్వాయిపల్లి గ్రామంలో గీతా కార్మికులకు సోమవారం ప్రత్యేకంగా ఐడి కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గీతా కార్మిక సంఘం అధ్యక్షుడు దొడ్లపాటి జంగయ్య గౌడ్, ఉపాధ్యక్షుడు గాదమోని నరేష్ గౌడ్, మాజీ అధ్యక్షుడు జంగం సత్తయ్య గౌడ్ తదితరులు పాల్గొని అర్హులైన సంఘం సభ్యులకు ఐడీ కార్డులను పంపిణీ చేయడం జరిగింది.