ఫోన్‌పేకు భారీ షాక్: ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ లో నలభై శాతం తగ్గిన యాక్టివ్ యూజర్లు
రిపోర్టర్: శివ
స్థలం: Hyderabad
డిజిటల్ పేమెంట్స్ రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ సంస్థ ఫోన్‌పే ట్రేడింగ్ బిజినెస్ లో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోందని ఆర్థిక నిపుణులు వెల్లడించారు. గత ఏడాదిన్నర కాలంలో ఈ సంస్థ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్ యాక్టివ్ యూజర్ల సంఖ్య ఏకంగా నలభై శాతం పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. యూపీఐ సేవల్ లో అగ్రగామిగా ఉన్నప్పటికీ, కస్టమర్లను ఇన్వెస్టర్లుగా మార్చడంలో కంపెనీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోతోందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.