ఖమ్మంలో లారీ బీభత్సం: తల్లి ఒడిలో నుంచి జారిపడి మూడేళ్ల చిన్నారి మృతి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ఖమ్మం

ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ కూడలి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి నిషిత దుర్మరణం చెందిందని టూటౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు. కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన దంపతులు కూతురుతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వెనుక నుంచి లారీ ఢీకొట్టిందని వెల్లడించారు. తల్లి ఒడిలో నుంచి కిందపడిన చిన్నారిపై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.