యువతను చూసి మోదీ భయపడుతున్నారు: CJP చీఫ్ అభిజీత్ సంచలన ఆరోపణలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వరంగల్
దేశ యువతను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని సిజేపి చీఫ్ అభిజీత్ మండిపడ్డారు. ఢిల్లీలో ఆంక్షల అవసరం ఏంటని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రజలపై మోదీ, అమిత్ షా యుద్ధం చేస్తున్నారా అని అభిజీత్ నిలదీశారు. నిరసనకు రావొద్దని ప్రజలను బెదిరిస్తున్నారని, ఓట్లు పడవని మోదీ భయపడుతున్నారని మీడియాతో స్పష్టం చేశారు.