ఆత్మకూరులో శ్రీ జ్వాలాముఖి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

రిపోర్టర్: గోపి స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని శ్రీశ్రీ జ్వాలాముఖి అమ్మవారిని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం దాతల సహకారంతో సుమారు ఐదు లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన మెటల్ షీట్ మండపాన్ని ఆయన ఘనంగా ప్రారంభించారు. అమ్మవారి ఆశీస్సులు అందుకున్న అనంతరం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నాయకులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతం చేశారు.