సమస్యలపై ప్రశ్నించిన మహిళలతో విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా వాగ్వాదం

రిపోర్టర్: రమేష్ స్థలం: Vijayawada, Andhra Pradesh

విజయవాడలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు స్థానిక మహిళల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. వర్షం వస్తే ఇళ్లలోకి నీరు చేరుతోందని, వెంటనే రోడ్డు వేయాలని మహిళలు ఆయనను నిలదీశారు. వరదలు వచ్చినప్పుడు తమను పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు, ఎమ్మెల్యే మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. త్వరలోనే రోడ్డు వేయిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి సమాధానం ఇచ్చారు.