గురుగ్రామ్ అడిడాస్ టెక్ హబ్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు
రిపోర్టర్: శివ
స్థలం: గురుగ్రామ్
ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ సంస్థ అడిడాస్ తన గురుగ్రామ్‌లోని ఇండియా టెక్నాలజీ హబ్‌లో భారీ స్థాయిలో ఉద్యోగ కోతలకు శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 15న నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో ఆపరేటింగ్ మోడల్‌ను సరళీకృతం చేసే పేరుతో ఈ పునర్వ్యవస్థీకరణ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ లేఆఫ్స్ కారణంగా సుమారు 350 మందికి పైగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ప్రభావం 20 శాతం లోపే ఉంటుందని కంపెనీ చెబుతుండగా, ప్రభావిత ఉద్యోగులకు డిసెంబర్ 15 వరకు గడువునిచ్చి అంతర్గతంగా ఇతర అవకాశాలను పరిశీలించే వెసులుబాటు కల్పించింది.