ఈసీ నిర్ణయంపై రాహుల్ గాంధీ నిప్పులు: నవంబర్ ఒకటో తేదీన చలో ఢిల్లీ మార్చ్

రిపోర్టర్: శివ స్థలం: New Delhi

ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలిపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నవంబర్ ఒకటో తేదీన ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో నిర్వహించనున్న చలో ఢిల్లీ మార్చ్లో ప్రజలందరూ పెద్దఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఓట్ల చోరీ ఆరోపణలపై ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ ఆందోళనలో విద్యార్థులు, రైతులు, కార్మికులు, యువకులు విరివిగా తరలిరావాలని ఆయన కోరారు.