రూ.35 కోట్లతో సబ్‌స్టేషన్ నిర్మాణానికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన
రిపోర్టర్: సురేష్
స్థలం: బాపట్ల
సంతమాగులూరు మండలం ఏల్చూరులో ముప్పై ఐదు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలతో నూతన నూట ముప్పై రెండు బై ముప్పై మూడు కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి విద్యుత్ శాఖ మంత్రి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. ఈ సబ్‌స్టేషన్‌తో గృహాలకు, రైతులకు, పరిశ్రమలకు లో ఓల్టేజీ సమస్యలు పూర్తిగా తగ్గించి, నాణ్యమైన నిరంతర విద్యుత్ అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొంటూ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని తెలిపారు.