రాబోయే ఎల్నినో ముప్పును ఎదుర్కొనేందుకు కుర్రారంలో పకడ్బందీ నీటి కార్యాచరణ

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కుర్రారం గ్రామంలో సర్పంచ్ బొడ్డు భాస్కర్ ఆధ్వర్యంలో ఎల్నినో ప్రభావంపై అధికారులు ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. రానున్న రోజుల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని మండల పర్యవేక్షకులు అల్లం ఇన్నారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.