కూటమి పాలనలో వైఫల్యాలు: పెదబయలులో వైసీపీ విస్తృత సమావేశం
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: పెదబయలు
పెదబయలు మండలం ఇంజరి పంచాయతీలో వైసీపీ ఆధ్వర్యంలో బూత్ కమిటీల బలోపేతంపై విస్తృత సమావేశం నిర్వహించారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించారు. సంక్షేమ పథకాల పేర్లు మార్చడం తప్ప కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదని మత్స్యలింగం తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు నేతలు పిలుపునిచ్చారు.