కలెక్టర్ల చొరవతో వేగంగా పరిశ్రమల భూసేకరణ

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు కలెక్టర్ల చొరవతో భూసేకరణ వేగంగా జరుగుతోందని పరిశ్రమలశాఖ కార్యదర్శి యువరాజ్ తెలిపారు. అనకాపల్లి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ముందస్తు భూసేకరణ ద్వారా భారీగా పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. కొత్త క్లస్టర్ల ద్వారా రూ.30 వేల కోట్ల పెట్టుబడులు, వేలాది మందికి ఉపాధి లభించనుందని వెల్లడించారు. కలెక్టర్ల ప్రత్యేక చొరవతో పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు వివరించారు.