కరెంట్ కోతలపై రాజీవ్ రహదారి దిగ్బంధం: మాజీ మంత్రి గంగుల అరెస్ట్

రిపోర్టర్: రాము స్థలం: కరీంనగర్

రాష్ట్రంలో విద్యుత్తు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ కరీంనగర్ రూరల్ మండలంలో రైతులు రోడ్డెక్కారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఆదివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దుర్శేడ్లో రాజీవ్ రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు. కాలిన మోటర్లతో మహిళా రైతులు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. రాస్తారోకో నిర్వహించిన గంగుల కమలాకర్తోపాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.