పది, ఇంటర్ పరీక్షల తేదీల్ లో మార్పు: మార్చికి వాయిదా వేసిన పశ్చిమ బెంగాల్ సర్కార్
రిపోర్టర్: గోపి
స్థలం: Kolkata
జనాభా లెక్కల సేకరణ కారణంగా పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలను మార్చి నెలకు వాయిదా వేస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ పాఠశాల విద్యాశాఖ మంత్రి దీపక్ బర్మన్ వెల్లడించారు. ఈ మేరకు సవరించిన పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర విద్యాశాఖకు బోర్డు అధికారులు పంపారు. మార్చి రెండు నుండి పదహారు వరకు పరీక్షలు నిర్వహించాలని తాజాగా ప్రతిపాదించారు. గతంలో ఫిబ్రవరి పదిహేను నుండి ఇరవై ఐదు వరకు ఈ పరీక్షలను నిర్వహించాలని ముందుగా షెడ్యూల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే.