బిగ్ బాస్ హౌస్‌లో లక్ష్మీప్రియ, ఆనంది మధ్య తీవ్ర వాగ్వాదం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తమిళనాడు

బిగ్ బాస్ తమిళ సీజన్ 10 రెండో వారంలో వంట పనుల విషయంలో లక్ష్మీప్రియ, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఆనంది మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నాకు గౌరవం కావాలని లక్ష్మీప్రియ గట్టిగా అనడంతో హౌస్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ సీజన్‌లో మొదటి నామినేషన్ల ప్రక్రియ తర్వాత కంటెస్టెంట్ల మధ్య పోటీ మరింత ఉత్కంఠగా మారుతోంది.