విదేశీ నేతల ఆరోగ్యంపై వస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధం
రిపోర్టర్: రాము
స్థలం: భారత్
భారత్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరై వెళ్లిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాల ఆరోగ్యం క్షీణించిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎలాంటి ఆధారాలు లేని ఈ వదంతులను ప్రజలు నమ్మవద్దని ఫ్యాక్ట్ చెక్ విభాగం ద్వారా స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది.