చివరి దశకు నిఖిల్ 'స్వయంభు' షూటింగ్, త్వరలోనే రిలీజ్ డేట్!

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా 'స్వయంభు'. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 175 రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంలో సుమారు 2,500 వీఎఫ్‌ఎక్స్ షాట్స్‌ను వాడుతున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.