కుండపోత వర్షాలతో ఏలేరు జలాశయానికి భారీగా వరద నీరు
రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్
స్థలం: ఏలేశ్వరం
ఏలేశ్వరంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏలేరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయంలో ప్రస్తుతం నీటి నిల్వ 17.950 టీఎంసీలుగా ఉంది. భారీ వర్షాలు కొనసాగితే నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.