'భారత్లో సెమీకండక్టర్ రంగం అద్భుత వృద్ధి సాధిస్తోంది': ప్రధాని నరేంద్ర మోదీ
రిపోర్టర్: హరి
స్థలం: న్యూఢిల్లీ
భారతదేశంలో సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో భారీ సెమీకాన్ సదస్సును ప్రారంభించారు. ఈ అంతర్జాతీయ సదస్సు ద్వారా గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తూ, దేశంలో చిప్ తయారీ పరిశ్రమను విస్తరించేందుకు భారత్ పెద్దఎత్తున ప్రయత్నాలు ప్రారంభించింది. టాటా గ్రూప్, మురుగప్ప గ్రూప్ వంటి సంస్థలతో పాటు మైక్రాన్ టెక్నాలజీ భాగస్వామ్యంతో దేశీయంగా చిప్ తయారీ ఊపందుకుంటుండగా, ఈ సదస్సు ద్వారా ప్రపంచ పెట్టుబడిదారులకు భారత్ తన దీర్ఘకాలిక నిబద్ధతను చాటిచెప్పింది.