కార్మికుల శ్రమను గౌరవించడంలో సమాజం విఫలమైందన్న హైకోర్టు

రిపోర్టర్: గోపి స్థలం: ఢిల్లీ

భారతదేశంలో కార్మికుల శారీరక శ్రమను గుర్తించి గౌరవించడంలో సమాజం విఫలమైందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. నిద్రకు భంగం కలిగించొద్దని వారించిన కార్మికుడు రాజిందర్ కుమార్‌పై దాడి చేసిన కేసులో నిందితుడు వీర్ పాల్‌కు ట్రయల్ కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను కోర్టు మూడేళ్లకు తగ్గించింది. హత్యాయత్నంగా కాకుండా సాధారణ దాడిగా నేరాన్ని సవరిస్తూ జస్టిస్ విమ్ కుమార్ యాదవ్ ఈ తీర్పు వెలువరించారు.