తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ లేఖను తీవ్రంగా ఖండించిన వి శ్రీనివాస్ గౌడ్
రిపోర్టర్: అశోక్
స్థలం: మహబూబ్ నగర్
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ - మహబూబ్ నగర్ వెల్లడించారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న పరిణామాలపై తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.