నా కెరీర్‌లోనే అత్యంత బిగ్‌బడ్జెట్ చిత్రం మహేంద్రగిరి వారాహి

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

సుమంత్ హీరోగా నటించిన డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ 'మహేంద్రగిరి వారాహి' ఈ నెల 11న విడుదల కానుంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తన కెరీర్‌లో అత్యంత బిగ్‌బడ్జెట్ మూవీ అని సుమంత్ తెలిపారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసే వ్యక్తిగా ఇందులో కనిపిస్తానని, సిద్ధు జొన్నలగడ్డ కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తాయని చెప్పారు.