'కారు ఆపు..': ప్రియుడి కారు బోనెట్‌పైకి దూకిన యువతి
రిపోర్టర్: హరి
స్థలం: లక్నో
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని జనేశ్వర్ మిశ్రా పార్క్ వద్ద ప్రియుడి మోసాన్ని ప్రశ్నించిన యువతి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మరో మహిళతో కలిసి కారులో వచ్చిన ప్రియుడిని నిలదీయగా, అతడు కారుతో పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన యువతి కారు బోనెట్‌పైకి దూకగా, కారు వేగంగా వెళ్లడంతో ఆమె కిందపడి స్వల్పంగా గాయపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.