ఆసియా క్రీడల్లో ఘోర తప్పిదం సౌత్ కొరియా మ్యాచ్‌లో నార్త్ కొరియా గీతం ప్లే
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నగోయా
నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో నిర్వాహకుల వైఫల్యం కలకలం రేపింది. పురుషుల హాకీ మ్యాచ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో తలపడేందుకు వచ్చిన సౌత్ కొరియా జట్టుకు బదులుగా నార్త్ కొరియా జాతీయ గీతాన్ని నిర్వాహకులు ప్లే చేశారు. దీంతో సౌత్ కొరియా ఆటగాళ్లు, కోచ్ మిన్ టే-సియోక్ తీవ్ర అవాక్కయ్యి అయోమయానికి గురయ్యారు. ఈ పొరపాటుపై సౌత్ కొరియా ప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిర్వాహక కమిటీకి అధికారికంగా ఫిర్యాదు చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.