అరుదైన మెదడు శస్త్రచికిత్సతో పసికందు ప్రాణాలు కాపాడిన వైద్యులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విజయనగరం
విజయనగరం సుఖీభవ ఆసుపత్రి వైద్యులు అరుదైన మైక్రో సర్జరీ నిర్వహించి చిన్నారి ప్రాణాలు కాపాడారు. మెదడులో కణితితో బాధపడుతున్న చిన్నారికి విజయవంతంగా శస్త్రచికిత్స చేసి తొలగించారు. నగరంలో ఇంత చిన్నారికి ఇలాంటి సంక్లిష్టమైన సర్జరీ చేయడం ఇదే తొలిసారని డాక్టర్ పి.ఎస్.వి. రామారావు మరియు డాక్టర్ రెడ్డి శంకర్ రావు తెలిపారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.