జెప్టో మరియు బ్లింకిట్ ద్వారా ఐఫోన్ 18 ప్రో విక్రయాలు

రిపోర్టర్: హరి స్థలం: India

క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో ద్వారా ఆపిల్ లేటెస్ట్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మరియు ఎయిర్‌పాడ్స్ 5 విక్రయాలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 18 ఉదయం 8 గంటల నుంచి ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో జెప్టో ఈ సేవలను అందిస్తుండగా, బ్లింకిట్ హైదరాబాద్, పుణె, కోల్‌కతా వంటి 10 ప్రధాన నగరాల్లో డెలివరీ చేస్తోంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ.7,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ మరియు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం లభిస్తోంది.